Big Boss Non Stop: మైండ్ యువర్ వర్డ్స్..హమీదకు అషురెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

-

‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ ఓటీటీ షో ఏడో వారంలోకి ఎంటర్ అయింది. కంటెస్టెంట్స్ టైటిల్ విన్నింగ్ కోసం ఒకరిని మించి మరొకరు ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 46వ రోజు ప్రోమోను బిగ్ బాస్ నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. సదరు ప్రోమో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

‘బిగ్ బాస్’ పోటీదారులుగా నిలిచే అవకాశాలు పెంచుకునేందుకు ‘బిగ్ బాస్’ మరొక టాస్క్ ఇచ్చినట్లు ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. ‘గ్రాబ్ ద ఫ్లాగ్’ అనే టాస్క్ ను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఇచ్చారు. ఈ క్రమంలో రింగ్ లోకి దిగిన కంటెస్టెంట్స్ మరొకరి వద్ద ఉన్న ఫ్లాగ్ ను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ వచ్చింది.

గేమ్ రూల్స్ బుక్ లో లేనప్పటికీ అఖిల్ ఆట విధానం బాగాలేదని గేమ్ నుంచి సంచాలక్ అషురెడ్డి డిస్ క్వాలిఫై చేసింది. దాంతో హమీద అషురెడ్డిపైన అరిచేసింది. నీకేమైనా పిచ్చి లేసిందా? అంటూ హమీద అషురెడ్డి ని అంది. దాంతో సంచాలక్ అషురెడ్డి మైండ్ యువర్ వర్డ్స్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతటితో ప్రోమో ముగిసింది.

ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. ఏడో వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. బిందు మాధవి ఓటింగ్ పర్సంటేజీలో సత్తా చాటుతోంది. నటరాజ్ మాస్టర్ అందరి కంటే తక్కువ ఓటింగ్ తెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news