గణేషుడి నిమజ్జనం వద్ద హైదరాబాద్ పోలీసుల డ్యాన్స్..!

-

దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ఇవాళ చాలా ఉత్సాహంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా వినాయ విగ్రహాల శోభయాత్ర జరుగుతున్న నేపథ్యంలో గణేశుడి ఊరేగింపులో భక్తులు ఆటపాటలతో ఉత్సాహంగా వాడవాడల నృత్యం చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ మధ్యాహ్నం హుస్సెన్ సాగర్ లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగింది.  హైదరాబాద్ లోని హుస్సెస్ సాగర్ వద్ద జరుగుతున్న గణేశుడి శోభయాత్రలో భక్తులతో పాటు భద్రతను పర్యవేక్షించే పోలీసులు సైతం డ్యాన్స్ చేశారు డీజీ పాటలకు మాస్ స్టెప్పులు వేసి భక్తుల్లో మంచి జోష్ నింపారు.

హుస్సెన్ సాగర్ వద్ద ఓ కానిస్టేబుల్ డివైడర్ పై నిలబడీ డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేయడంతో సాధారణ ప్రజలు ఆశ్చర్యపోయారు. నిమజ్జనాన్ని చూసిందుకు వచ్చిన భక్తులకు డ్యాన్స్ వేసి మంచి జోష్ నింపారు కానిస్టేబుల్. కానిస్టేబుల్ టాలెంట్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కానిస్టేబుల్ పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news