వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లేకపోవడం వల్ల సిగిరెట్‌ వాడకం పెరిగిందంటున్న సర్వేలు

-

కరోనా ముందు వరకూ చాలా మందికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ లేదు. ఎన్ని గంటల జర్నీ అయినా సచ్చినట్లు ఆఫీస్‌కు వెళ్లే పనిచేసేవాళ్లం. కానీ కరోనా రావడం వల్ల కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చాయి. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొన్ని కంపెనీలు పాటిస్తున్నాయి. కొన్ని దీన్ని కాస్త మార్చి హైబ్రీడ్‌ చేశాయి. రెండేళ్ల క్రితంలా అయితే పరిస్థితి లేదు. చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకే రప్పించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారు అంటారేమో.. పాయింట్‌కు వస్తున్నాం.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తగ్గడం వల్ల సిగిరెట్‌ వాడకం పెరిగిందట. అదేంటబ్బా అలా ఎలా..దానికి దీనికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..?

smoking

2020, 2021 కోవిడ్ మహమ్మారి సంవత్సరాలలో సిగరెట్ అమ్మకాలతో పోల్చుకుంటే.. ఈ ఏడాది సిగిరెట్‌ అమ్మకాలు 18 శాతం పెరిగాయి. కోవిడ్‌ తర్వాత ఈ రెండేళ్లలో.. సిగిరెట్‌ అమ్మకాలు..7 నుంచి 9 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని CRISIL రేటింగ్స్ విశ్లేషణలు సూచిస్తున్నాయి. కోవిడ్ తర్వాత సిగరెట్ల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. కార్యాలయాలకు వెళ్లే వారి సంఖ్య పెరగడం, ప్రభుత్వం పన్నులు పెద్దగా పెంచకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

ఎందుకు పెరిగాయి..

ఆఫీసులో సిగరెట్ కోసం బ్రేక్ తీసుకోవడం మామూలే. అదేవిధంగా రోడ్డు పక్కనే ఉన్న టీ స్టాల్స్‌, బేకరీల వద్ద చాలా మంది టీ, సిగరెట్‌లు తాగుతుంటారు. బయట పనికి, ఆఫీసుకు వెళ్లే వారిలో ఇది ఎక్కువ.

2023 ఆర్థిక సంవత్సరంలో కార్యాలయాలకు వెళ్లి పనిచేసే వారి సంఖ్యాశాతం 40 అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 65 నుంచి 70 శాతం వరకు ఉండవచ్చని అంచనా.

సిగరెట్లను ప్రజలకు మరింత ఆకర్షణీయంగా మార్చడానికి కంపెనీలు ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నాయి. సిగరెట్ పొగ యొక్క బలమైన వాసనను తగ్గించడానికి కొత్త రుచులు, ఫ్లేవర్స్‌ను జోడిస్తున్నాయి. ఏది ఏమైనా చెడును ఎంత కవర్‌ చేసినా అది కీడే చేస్తుంది. కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండటం బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news