అర్ధరాత్రి నుంచి హైదరాబాద్​లో భారీ వర్షం

-

కొన్నిరోజుల గ్యాప్ తర్వాత మళ్లీ వరణుడు వచ్చేశాడు. గురువారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్​లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున పనులపై బయటకు వెళ్లే వారు వర్షం కురుస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.

మరోవైపు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు చేరింది. కార్ల టైర్లవరకు నీళ్లు చేరాయి. ద్విచక్రవాహనాలు వర్షం వల్ల వచ్చిన వరదతో ముందుకు కదలడం ఇబ్బందికరంగా మారడంతో రాత్రి వేళ ఇంటికి వెళ్లాల్సిన వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లపై నీళ్లు నిలిచి ఉండడంతో ఎక్కడ గుంత ఉందో తెలియకపోవడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకుకదిలాయి.

నగరంలో ముఖ్యంగా.. ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఎస్ఆర్‌నగర్, సనత్‌నగర్‌, బోరబండ, కాప్రా, ఈసీఐఎల్, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, సైదాబాద్, మలక్‌పేట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి వాన పడుతుండటంతో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. వానల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news