హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. మరో 3 రోజులపాటు భారీ వర్షాలు..

-

హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్. హైదరాబాద్‌ మహా నగరంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు… హైదరాబాద్‌ నగరంలో ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేశారు అధికారులు. కాగా, హైదరాబాద్‌ నగరంలో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది.

సాయంత్రం 5.30 గంటలకు కుండపోతగా కురిసింది. దాదాపు అరగంట పాటు భారీ వర్షం కురవడంతో నగర ప్రజలు వణికిపోయారు. ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసి ప్రజలను బెంబేలెత్తించింది. ఆరు గంటల సమయానికి నగరంలోని మియాపూర్‌లో 3.65 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కేవలం 30 నిమిషాల్లో ఈ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news