హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం… గ్రీన్ బావార్చిలో హోటల్ లో ఘటన

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయదుర్గం గ్రీన్ బావర్చి హోటల్ లో ఈ ప్రమాదం జరగినట్లు తెలుస్తోంది. భవనంలోని థర్డ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సమయంలో పై అంతస్తులో ఉన్న వారిని కిందికి తరలించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో 20 మంది దాకా అగ్ని ప్రమాదం జరిగిన పై అంతస్తులో చిక్కుకుపోయారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. 

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ చర్యలు ప్రారంభాించారు. ఇప్పటి వరకు ముగ్గురిని రెస్క్యూ చేసి సన్ షైన్ ఆస్పత్రికి తరలించారు. చిక్కుకుపోయిన వారంతా హాహాకారాలు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల దట్టంగా పొగ అలుముకుంది. అయితే అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల ద్వారా బాధితులను కిందకు తీసుకువస్తున్నారు. ఐ మాక్ ఛాంబర్ రెండో అంతస్తు ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లోనే గ్రీన్ బావర్చి హెటల్ ఉంది. అగ్ని ప్రమాదం వల్ల గ్రీన్ బావర్చిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.