అలెర్ట్: ఇవాళ, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

గణేశ్ నిమజ్జనానికి భాగ్యనగరం ముస్తాబైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇవాళ ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరిగేలా నగర పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా అంగరంగ వైభవంగా జరిగేలా ప్రణాళిక రెడీ చేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ వెల్లడించారు.

 

రేపు ఉదయం 10 గంటల కల్లా నిమజ్జన ప్రక్రియ ముగుస్తుందని ఆశిస్తున్నామని.. ఇప్పటికే ట్రాఫిక్‌ అడ్వయిజరీ జారీ చేసినట్టు తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా అందరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హుస్సేన్‌ సాగర్‌లో ఇవాళ దాదాపు 15వేలు నుంచి 20వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అంచనా వేస్తున్నట్టు రంగనాథ్‌ తెలిపారు.