హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌…నేటి నుంచే నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

హైదరాబాద్‌ నగర వాసులకు ట్రాఫిక్ అలర్ట్. ఇవాళ్టి నుంచి నగరంలోపలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్‌ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. నగరంలో మరమ్మతుల కారణంగా ఇవాళ్టి నుంచి సికింద్రాబాద్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లీస్తున్నట్లు చెప్పారు. సీటీవో జంక్షన్‌ నుంచి రసూల్‌ పూరా టు బేగంపేట్‌ వచ్చే వాహనాలను హనుమాన్‌ దేవాలయం నుంచి ఎడమ వైపునకు మళ్లీంచనున్నారు.

అక్కడి నుంచి కిమ్స్‌ ఆస్పత్రి మీదుగా మినిస్టర్‌ రోడ్డులోకి వాహనాలు డైవర్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మాదిరిగా బేగంపేట్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను కిమ్స్‌ ఆస్పత్రి మీదుగా మళ్లించనున్నారు. అక్కడి నుంచి కిమ్స్‌ ఆస్పత్రి మీదుగా మినిస్టర్‌ రోడ్డులోకి వాహనాలు డైవర్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మాదిరిగా బేగంపేట్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను కిమ్స్‌ ఆస్పత్రి మీదుగా మళ్లించనున్నారు. వాహనదారులు ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ తోపాటు ఎన్టీఆర్‌ పార్క్‌, ట్యాంక్‌ బండ్‌ ఉపయోగించుకోవాలని ట్రాఫిక్‌పోలీసులు విజ్ఙప్తి చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news