పరీక్షలు అనగానే పిల్లల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. పైగా పరీక్షల్లో ఫలితాలు మంచిగా రావాలని చాలా మంది విద్యార్థులు కష్టపడుతూ ఉంటారు. నిజానికి మనం పరీక్షల్లో మంచి మార్కులు స్కోర్ చేయాలంటే మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి.
టెన్షన్ లేకుండా చూసుకోవడం చాలా అవసరం. అసలు నిజంగా చాలా మంది విద్యార్థులు టెన్షన్ పడుతున్నారని తెలియకుండానే టెన్షన్ పడిపోతుంటారు. కానీ టెన్షన్ పడడం వల్ల పరీక్షలు బాగా రాయలేరు. అయితే మరి మనం టెన్షన్ పడుతున్నామని ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అలానే ఆ టెన్షన్ ని ఎలా పోగొట్టుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీన్ని చూసేయండి.
విద్యార్థుల్లో ఒత్తిడి యొక్క లక్షణాలు:
ఎవరైనా విద్యార్థి ఒత్తిడి పడుతూ ఉంటే ఆ లక్షణాలు ఇలా ఉంటాయి. ఈ లక్షణాలు కనుక మీ పిల్లల్లో కనపడితే వాటి గుర్తించి జాగ్రత్త పడటం అవసరం ఎందుకంటే వాళ్ల యొక్క మానసిక ఆరోగ్యం బాగుంటేనే వాళ్లు పరీక్షల్లో మంచిగా సాధించడానికి అవుతుంది. మానసికంగా వాళ్ళు సిద్ధంగా ఉండేటట్టు తల్లిదండ్రులు చూడాలి.
ఒత్తిడి యొక్క లక్షణాలు:
చిన్న విషయానికి కోపం రావడం
చికాకుగా కనపడటం
త్వరగా నిద్ర పట్టకపోవడం
ప్రతీ చిన్నదానికి భయపడడం
ఆకలి లేకపోవడం
తిన్న ఆహారం జీర్ణం అవ్వక పోవడం
ఛాతిలో అసౌకర్యంగా ఉండడం
గుండె వేగంగా కొట్టుకోవడం
ఇలాంటివి పిల్లల్లో కనబడుతూ ఉంటాయి అటువంటప్పుడు కాసేపు చదవడం ఆపేసి వాళ్ళకి నచ్చిన పని చేయమనాలి దీంతో కాస్త ఒత్తిడిని తగ్గించుకోవడానికి అవుతుంది. కనుక తల్లిదండ్రులు ఈ లక్షణాలను కనుక పిల్లల్లో గమనించినట్లైతే ఈ విధంగా జాగ్రత్తపడండి.
ఒత్తిడిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి..?
ఇక్కడ ఉండే ఈ టిప్స్ ని ఫాలో అవ్వడం వల్ల ఒత్తిడిని ఎదుర్కోడానికి అవుతుంది అని నిపుణులు అంటున్నారు. మరి అది కూడా చూసేద్దాం.
అదేపనిగా చదవకుండా విరామం తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ప్రతిరోజూ ఏదైనా వ్యాయామం, వాకింగ్ వంటివి చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది.
డాన్స్ సైక్లింగ్ కూడా హెల్ప్ అవుతుంది.
కొన్ని సార్లు చదవాలి అనిపించదు అలాంటప్పుడు రిలాక్స్ గా ఉండి నచ్చిన పని చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.
కొన్ని సబ్జెక్ట్స్ ని గ్రూప్ స్టడీ చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.
ఇలా పిల్లలు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు దీంతో మంచిగా స్కోర్ చేయడానికి బాగుంటుంది అలానే ఒత్తిడి నుంచి దూరంగా ఉండి ఆనందంగా ఉండడానికి అవుతుంది.