వాయుగుండం క్రమంగా బలహీన పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాబట్టి మరో 24 గంటల్లో వర్ష తీవ్రత తగ్గనుంది అని చెప్పింది. ఉత్తర ఆంధ్ర తీరం సమీపంలో కళింగపట్నానికి దగ్గరలో తీరం దాటింది వాయుగుండం. ప్రస్తుతం విశాఖపట్నంకు వాయువ్య దిశలో రామగుండంకు తూర్పు దిశలో లో 310 కీ.మీ దూరంలో కేంద్రీకృతమైంది వాయుగుండం.
అయితే ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కేంద్రీకృతమై పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వాయుగుండం కొనసాగనుంది. దక్షిణ ఒడిశా – దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ మీదుగా కదులుతూ అల్పపీడన కేంద్రంగా మారే అవకాశం ఉన్నట్లు వహ్వారేనా శాఖ పేర్కొంది. అదే విధంగా అల్పపీడన కేంద్రంగా మారే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మరియు మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.