పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అమీన్‌పూర్‌లో మంగళవారం హైడ్రా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్నారు జేడీ సర్వే కార్యాలయ అధికారులతో పాటు హైడ్రా అధికారులు. ఎకరాకు పైగా ఉన్న పార్కు స్థలంతో పాటు.. రహదారులను గోల్డెన్ కీ వెంచర్ వాళ్లు కబ్జా చేశారంటూ వెంకటరమణ కాలనీ వాసుల ఫిర్యాదు చేసారు. ఇరు పక్షాల వాళ్లు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే జరిపింది హైడ్రా.
మొత్తం 5 సర్వే నంబర్లలోని 150 ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని సర్వే చేసిన జేడీ సర్వే కార్యాలయ అధికారులు.. వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీ వాసులు, గోల్డెన్ కీ వెంచర్ నిర్వాహకులతో పాటు.. పరిసర కాలనీ వాసులు, గ్రామస్థుల సమక్షంలో సర్వే నిర్వహించారు . లే ఔట్లను పరిశీలించి.. సర్వే నంబర్ల ఆధారంగా.. పార్కు స్థలాలతో పాటు.. రహదారులను కాపాడే పనిలో పడింది హైడ్రా. ఇక సర్వే నంబర్లు, హద్దు రాళ్ల ఆధారంగా భూముల సరిహద్దులను నిర్ధారించి.. ఎవరి లే ఔట్‌లోకి ఎవరు చొరబడ్డారనేది తేల్చేందుకు హైడ్రా అధికారుల కసరత్తు చేస్తుంది.