ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే కలెక్టర్ అయ్యాను : రంగారెడ్డి కలెక్టర్ శశాంక

-

ప్రభుత్వ పాఠశాలలో చదువుకోనే జిల్లా కలెక్టర్ ను అయ్యాను అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. చదువు మాత్రమే జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తుందన్నారు. ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద  గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు యూనిఫార్మ్స్ పాఠ్యపుస్తకాలు అందజేశారు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్య గురించి గొప్పగా వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు.

లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాలయాలకంటే.. ప్రభుత్వ పాఠశాలలోనే మంచి బోధన లభిస్తుందన్నారు. అన్ని రకాల వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వలు అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చాలా మంది తల్లిదండ్రులు చులకనగా చూస్తారని, డబ్బులు పెట్టినంత మాత్రాన కార్పొరేట్ విద్య మంచిదని గుడ్డి నమ్మకంలో వున్నారన్నారు. కార్పొరేట్ విద్య కన్నా ప్రభుత్వం విద్యలో రానించిన వారు చాలా మంది వున్నారన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత పదవులు చేరాలని ఆశిస్తున్నా అన్నారు. ఇంత గొప్ప స్థాయికి ఎదగాను అంటే అది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే అని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో పిలల్లను చేర్పించాలని కోరారు

Read more RELATED
Recommended to you

Latest news