జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేక వార్తలు చెబుతున్నాడంటూ… సీఎం రేవంత్‌ రెడ్డి కించ పరిచేలా మాట్లాడుతున్నాడనే ఉద్దేశ్యంతో… జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు…దాడి చేసినట్లు సమాచారం. పంజాగుట్ట సమీపంలో.. ఈ సంఘటన చోటు చేసుకుంది.  దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారనే ముద్ర వేసి, భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమే. ఒకవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరించడం నీచమైన చర్య. ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version