డీఎస్సీ ఆలస్యం చేస్తే.. నిరుద్యోగులకు నష్టం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-

పబ్లిక్ సర్వీస్ ను ప్రక్షాళన చేసి.. సాధ్యమైనన్ని రిక్రూట్ మెంట్స్ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఉద్యోగాల పై దృష్టి పెట్టలేదు. ఇప్పటికే అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయింది. డీఎస్సీ ఆలస్యం అయితే మరింత నష్టం జరుగుతుంది. నిరుద్యోగుల ఆకాంక్షను మేము నెరవేర్చుతున్నాం. పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ల కొరత ఏర్పడింది.  ఆ కొరతను తీర్చేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నాం. దాదాపు 2లక్షల 79వేల మంది నిరుద్యోగులు డీఎస్సీ అప్లై చేసుకున్నారు. 

 ఇప్పటికే 2లక్షల 500 మంది డీఎస్సీ అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నాారు. అధిక శాతం విద్యార్థులు డీఎస్సీ పరీక్ష జరగాలనుకుంటున్నారు. జులై 18 నుంచి పరీక్షలు జరుగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. పదేళ్ల తరువాత గ్రూపు 1 పరీక్ష నిర్వహించాం. 4,03,649 క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు. 3లక్షలకు పై అభ్యర్థులు పరీక్ష రాశారు. టీచర్ల విషయానికి 19వేల మందికి ప్రమోషన్లు.. 34 వేల మందికి బదిలీలు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news