మూడో సారి అధికారంలోకి వస్తే కేసీఆర్ మనమడికి మంత్రి పదవీ ఇస్తాడు : రేవంత్ రెడ్డి

-

దళితులకు మూడు ఎకరాల భూమి రాలేదు. కేజీ టూ పీజీ ఉచిత నిర్భంధ విద్య అమలు జరుగలేదు. జోగు రామన్న ఆదిలాబాద్ ని దోచుకున్నాడు. సీఎం కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణ మధ్య పోటీ జరుగుతుంది. రైతులకు కేసీఆర్ సర్కారు తీవ్ర అన్యాయం చేసింది. ఇండ్లు ఇవ్వలేదు. పింఛన్ ఇవ్వలేదు. ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. మూడో సారి అధికారంలోకి వస్తే మనమడికి మంత్రి పదవీ ఇస్తాడు కేసీఆర్. జోగురామన్నను ఓడించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. కాళేశ్వరం, మేడిగడ్డ గురించి నరేంద్ర మోడీ ఒక్కసారైనా మాట్లాడారా..? మోడీ సార్ పర్యటన వల్ల తెలంగాణకి లాభం ఏముంది. బీజేపీకి ఓటేస్తే.. బీఆర్ఎస్ కి ఓటు వేసినట్టేనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

జూరాల, నాగార్జున సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, ఎయిర్ ఫోర్ట్ ఇవన్ని నిర్మించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. కేసీఆర్ బిచ్చమెత్తుకునేవారు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట ఎమ్మెల్యే కాకముందే హరీశ్ రావు మంత్రి అయ్యాడని తెలిపారు. కాంగ్రెస్ పుణ్యం వల్లనే కేటీఆర్ మంత్రి అయ్యాడు. లేకుంటే బాత్ రూమ్ లు కడుక్కునే వాడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news