కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటే.. సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదు : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

-

తెలంగాణలో గత రెండు రోజుల నుంచి ఛతీస్ గడ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాచలం థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన ఎంక్వైరీ కమిషన్ కి మాజీ సీఎం రాసిన లేఖ సంచలనంగా మారింది. కేసీఆర్ 12 పేజీలు రాసిన లేఖలో కమిషన్ చైర్మన్ తప్పుకోవాలని కోరడం గమనార్హం. కమిషన్ విచారణను కేసీఆర్ తప్పుబట్టడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఫైర్ అవుతున్నాయి.

ఈతరుణంలోనే కేసీఆర్ లేఖపై బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి విచారణ చేపడుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ కి కేసీఆర్ రాసిన లేఖ అప్రజాస్వామికమని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అపాయింట్ చేసిన పవర్ కమిషన్ పై కేసీఆర్ ఎదురు దాడి చేస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించకుండా ఎందుకు సెలైంట్ ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news