తెలంగాణ రాష్ట్రంలో సవాళ్లు-ప్రతి సవాళ్ల రాజకీయాలు జోరందుకుంటున్నాయి. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి కోడంగల్ ఎమ్మెల్యే పదవీకి, సీఎం పదవీకి రాజీనామా చేసి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
తాజాగా కేటీఆర్ కి మంత్రి కోమటి రెడ్డి ఓ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలుగా ఇద్దరం రాజీనామా చేసి సిరిసిల్లలో పోటీ చేద్దాం. నాపై కేటీఆర్ గెలిస్తే.. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కేటీఆర్ ఓడితే బీఆర్ఎస్ ను మూసేస్తామని ప్రకటించాలని సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేటీఆర్ చిన్న పిల్లగాడని.. అతనికి టెక్నికల్ నాలెడ్జ్ లేదని సెటైర్ వేశారు కోమటిరెడ్డి. నా స్థాయి కేటీఆర్ ది కాదన్నారు. కేటీఆర్ కి క్యారెక్టర్ లేదన్నారు. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని విమర్శించారు.