మల్కాజ్​గిరి ఎంపీ సీటుపై ధీమా.. అందుకేనా కేటీఆర్ సవాల్​?

-

సీఎం రేవంత్​రెడ్డి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాల్​కు ప్రతి సవాల్​ విసురుకుంటూ బస్తీమే సవాల్​ అంటున్నారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలవాలని రేవంత్​రెడ్డి బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​కు సవాల్​ విసిరారు. ఇందుకు కేటీఆర్​ దీటుగా స్పందించారు. ‘కొడంగల్​ ఎమ్మెల్యే స్థానానికి, సీఎం పదవికి రేవంత్​రెడ్డి రాజీనామా చేయాలి. నేను సిరిసిల్లలో రాజీనామా చేస్తా. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్​గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ’ కేటీఆర్​ ప్రతి సవాల్​ విసరిరారు. మల్కాజ్ గిరి కాంగ్రెస్​ సిట్టింగ్​ స్థానం కావడం, అదీ సీఎం రేవంత్​రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో సార్వత్రా ఆసక్తి నెలకొంది.

2002లో ఏర్పాటైన డీలిమిటేషన్​ కమిటీ సిఫారసుల ఆధారంగా 2008లో మల్కాజ్​గిరి ఎంపీ స్థానం మనుగడలోకి వచ్చింది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి గెలుపొందారు. 2019లో రేవంత్​రెడ్డి విజయం సాధించారు.

దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్​గిరి. ఇక్కడ దాదాపు 16 లక్షలకుపైగా ఓట్లున్నాయి. ఇక్కడ ​సెటిలర్ల ఓట్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్​యంలో మల్కాజ్​గిరి నుంచి విజయం సాధించడం అంత ఆషామాషీ కాదు. గత ఎన్నికల్లో గెలిచిన రేవంత్​రెడ్డి కేవలం 10,919 ఓట్ల తేడాతో విజయం సాధించాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన భారతీయ రాష్ట్ర సమితి గ్రేటర్​ హైదరాబాద్​లో మాత్రం మంచి ఫలితాలను సాధించింది. ముఖ్యంగా మల్కాజ్​గిరి పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెట్లలోనూ విజయం సాధించింది. మేడ్చల్​, మల్కాజ్​గిరి, కుత్బుల్లాపూర్​, కూకట్​పల్లి, ఉప్పల్​, ఎల్​ బీనగర్, సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా కూతుబుల్లాపూర్​ సిట్టింగ్​ అభ్యర్థి 85 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్​గిరి నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాలో బీఆర్​ఎస్​ ఉంది. ఈ ధీమాతో రేవంత్​రెడ్డిక సవాల్​ విసిరినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news