మూసీకి అడ్డుపడితే.. మరో ఉద్యమం తప్పదని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీ నీళ్లతో క్యాన్సర్ర్, గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తుల, అలెర్జీ వంటి తీవ్రమైన జబ్బులతో నా నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నా ప్రజలకు జీవాయువు అయినా మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఫ్లోరైడ్ తో రీసెర్చ్ చేశాం. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు చెప్పారు.. ప్రపంచంలో ఇంత డేంజరస్ రివర్ లేదని చెప్పారు. మా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం SLBC టన్నెల్. పాత నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగి ఆల్టర్ నేట్ గా ఫ్లోరైడ్ బయటికి పోతుందని ప్రొఫెసర్లు చెప్పారు. అదొక్కటే శాశ్వత పరిష్కారం. మూసీ ప్రక్షాళన కోసం.. మా నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలది.. జీవన పోరాటం.. ప్రతిపక్షాలది రాజకీయ ఆరాటం అని తెలిపారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.