తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ అలర్ట్. రైతు బీమా పథకం పై కీలక అప్డేట్ వచ్చింది. రైతు బీమా పథకంలో భాగంగా గత ప్రభుత్వం.. రైతు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేది. ఈ మేరకు ఎల్ఐసి కి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బీమా కట్టేది. గత సంవత్సరంలో ఎల్ఐసి కి ఒక్కో రైతుకు… 3600 చొప్పున బీమా ప్రీమియం చెల్లించింది సర్కార్.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత… ఇప్పుడు మళ్లీ ప్రీమియం చెల్లించాల్సిన సమయం వచ్చింది. అయితే ఈ సంవత్సరం ప్రీమియం ఎంత చెల్లించాలని దానిపై త్వరలోనే క్లారిటీ రాబోతుంది. రైతు బీమా ఉన్న రైతులు సహజంగా లేదా ఏ విధంగా అయినా మరణిస్తే… ఆ సదరు రైతు కుటుంబానికి 5 లక్షల పరిహారం ఈ పథకం కింద అందుతోంది. గులాబీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగానే త్వరలోనే ప్రీమియం కూడా చెల్లించబోతుంది.