సొంతూళ్లకు వెళ్ళేవారికోసం “ఈ పాస్” ఇలా అప్లై చేసుకోండి

-

ఇప్పుడు లాక్ డౌన్ లో చాలా మంది తమ సొంత ఊరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకే రాష్ట్రంలో ఉండి కొన్ని ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఉదాహరణకు అదిలాబాద్ కి చెందిన వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఉంటే దాదాపు వాళ్ళు సొంత ఊరికి వెళ్ళాలి అంటే 700 కిలోమీటర్ల వరకు ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది. దీనితో ప్రభుత్వం, పోలీసులు ప్రజలకు ఈ పాస్ లు అందిస్తున్నారు.

పర్యాటక ప్రాంతాలకు వెళ్లి, చదువుకోవడానికి వెళ్లి, ఉద్యోగాలు, కూలి పనుల కోసం వెళ్లి చాలా మంది చిక్కుకుని పోయారు. దీనితో తెలంగాణా పోలీసులు ఈ పాస్ విధానానికి శ్రీకారం చుట్టారు. సొంత ఊరు, సొంత రాష్ట్రం వెళ్ళాలి అనుకునే వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో ఈ పాస్ ని పోలీసు శాఖ జారీ చేస్తుంది. ఈ పాస్ ఎవరికి అయితే కావాలో వారు దరఖాస్తు చెయ్యాలి.

సరైన కారణం కూడా వాళ్లకు ఉండాలి… ఈ పాస్ అవసరమైన వారు వారి పేరు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ప్రాంతం, ఇతర వివరాలు పొందు పరచాలి. వాళ్ళ వివరాలను ఆధారంగా చేసుకుని పోలీసులు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత పాసులు జారీ చేస్తారు. దీని ద్వారా తమ తమ ఊర్లకు వెళ్ళాలి అనుకునే వారు వెళ్ళవచ్చు అని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

https://epass-tspolice.app.koopid.ai/tsp/index.html

Read more RELATED
Recommended to you

Latest news