కొత్త సెక్రటేరియట్ పనులు 10 రోజుల్లో పనులు పూర్తి కావాలి – వేముల ప్రశాంత్ రెడ్డి

-

ఫిబ్రవరి 17న డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అని..తుది దశ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.10 రోజుల్లో అన్ని రకాల పనులు పూర్తి కావాలన్నారు. నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా తిరిగి అక్కడే అధికారులు,వర్క్స్ ఏజన్సీతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రధాన ద్వారం,పోర్టికో,అంతర్గత రోడ్లు, ఫౌంటైన్ల నిర్మాణం, గ్రౌండ్ ఫ్లోర్ నుండి సీఎం బ్లాక్ అయిన 6వ ఫ్లోర్ వరకు గల కారిడార్లు,మంత్రుల చాంబర్స్,వర్క్ స్టేషన్ లకు సంబందించిన అన్ని రకాల పనులపై బ్లాకుల వారిగా క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించారు.

గ్రానైట్ ఫ్లోరింగ్,మార్బుల్ ఫ్లోరింగ్,ఫాల్స్ సీలింగ్, జీఆర్సి పనులు,లిఫ్ట్ ల పనులు, కోర్ట్ యార్డ్ ల్యాండ్ స్కేప్ పనులు, సివరేజ్ వర్క్స్,రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్స్,ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లోర్ వైస్ క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిపై సమీక్షలో చర్చించారు. నిర్మాణ తుదిదశ పనులు శరవేగంగా పూర్తి కావాలని, సరిపడా మ్యాన్ పవర్ పెంచి 10 రోజుల్లో బ్లాకుల వారిగా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు, వర్క్ ఏజెన్సీకి స్పష్టం చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news