కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం యాదవులపల్లిలో గురుకుల పాఠశాల సముదాయ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం జూన్ నెల వరకు అన్ని హంగులతో పాఠశాలను పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 సమీకృత గురుకుల పాఠశాలాలకు శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాఠశాలలో వాడే కరెంటు బిల్లు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పాం.
గత ప్రభుత్వంలో నిరుద్యోగులను పాలకులు మోసం చేశారు. నోటిఫికేషన్ వేసిన వెంటనే వాళ్లకు సంబంధించిన వ్యక్తులు కోర్టులలో కేసులు వేసి నిరుద్యోగులను మోసం చేశారు. కేసీఆర్ బిడ్డ కవితకు అతని బందువు వినోద్ రావుకు మాత్రం ఉద్యోగాలు పోయాక వెంటనే వారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉద్యోగాలు నియమిస్తారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాల నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రెండు లక్షలకు పైన రుణం తీసుకున్న రైతులు కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుంది. కానీ పైన రుణం రైతులు చెల్లించాలి. రుణమాఫీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు బ్యాంకులలో సమస్యలు ఉన్నాయి. రైతులు పంటలకోసం తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి. గ్రామాలలో ఉన్న బీఆర్ఎస్ వాళ్లకు ఎంత రుణం మాఫీ అయిందో లెక్కలు తీయండి. గ్రామాలలో మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తామని తెలిపారు. దేశంలో ప్రజలకు ఉపయోగపడే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకునేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.