రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు మొదటి, రెండో సంవత్సరాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. ఫస్ట్ ఇయర్ లో 4,78,718.. సెకండ్ ఇయర్ లో 5,02,260 మంది పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్షకు ముందు విద్యార్థులు తప్పక పాటించాల్సిన విషయాలు ఓసారి తెలుసుకుందామా?
- పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.
- పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
- పరీక్షకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.
- పరీక్షల్లో ఎవరైనా కాపీ కొట్టినా… ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా క్రిమినల్ కేసు నమోదు చేస్తారు.
- కాపీయింగ్ పాల్పడిన విద్యార్థిని డిబార్ చేయడంతో పాటు డ్యూటీలో ఉన్న అధికారులపైనా, సంబంధిత కేంద్రం యాజమాన్యం పైనా కఠిన చర్యలుంటాయి.
-
పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు టెలిమానస్ 14416 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే వారుఎదుర్కొంటున్న పరీక్షల భయాన్ని తొలగించి నూతన ఉత్సాహాన్ని నింపుతారు.