Telangana: మోడీ సర్కార్‌ నుంచి కేసీఆర్‌ కు పిలుపు

-

Telangana: మోడీ సర్కార్‌ నుంచి కేసీఆర్‌ కు పిలుపు వచ్చింది. వరుసగా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ జూన్ 9 ఇవాళ రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతేకాకుండా ప్రధానీ మంత్రితో పాటు మంత్రి మండలి కూడా కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఇండియా నుంచే కాక విదేశాల నుంచి కూడా అతిథులు హాజరుకానున్నారు.

KCR gets invite to Modi’s swearing-in today

ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావలసిందిగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలువురికి ఆహ్వానాలను పంపింది. ఈ వేడుకలో పాల్గొనడానికి ఇవాళ విదేశా అతిథులు ఢిల్లీకి చేరుకుంటారు. అయితే…మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తాజా మాజీ కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా, కేసీఆర్ ను హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version