పోచారం ఇంటి ముందు బాల్క సుమన్ ధర్నా ?

-

తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. కాసేపటి క్రితమే.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.

Is Balka Suman dharna in front of Pocharam’s house

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించలేదని సమాచారం అందుతోంది.

కానీ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ లోకి వెళతారని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. అయితే.. రేవంత్‌ రెడ్డి వచ్చిన తరుణంలోనే..పోచారం ఇంటి దగ్గర బాల్క సుమన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ధర్నా చేశారు. సీఎం రేవంత్‌ కావ్వాయ్‌ ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news