మరో రూ.30 వేల కోట్ల కోసం రేవంత్ వేట షురూ చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా పథకాలకు 2 నెలల్లో రూ. 30 వేల కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా. ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీమ్ ల అమలు సాధ్యమని సమాచారం.
బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్, మేలో రూ. 8,246 కోట్లు సేకరించగా….మరో రూ. 2వేల కోట్లు 3 రోజుల్లో తీసుకొనుంది. ఈ ఏడాది కోటాలో మరో రూ. 30 వేల కోట్లు తీసుకునేందుకు RBI అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
అటు ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 760 ఎకరాల భూమిని సైతం ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. రూ.48వేల కోట్ల భూములను తనఖా పెట్టడం ద్వారా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్లు ఏక కాలంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం అమ్మి పథకాలను ఇంప్లిమెంట్ చేయగా.. భూములను అమ్మడం కన్నా తనఖా పెట్టడం మేలు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.