మంగళగిరి కోసం ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేశ్

-

మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళ గిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేశ్. మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు మంత్రి నారా లోకేశ్. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన నారా లోకేష్…ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.

Lokesh Prajadarbar for the people of Mangalagiri

నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఇక అంతకు ముందకు మంత్రి పదవి రావడంపై స్పందించారు నారా లోకేష్. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పని చేస్తాను…యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను అని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను….ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తెచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తానునని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version