తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్లు పూర్తి…కేసీఆర్‌ సంచలన నిర్ణయం

-

తెలంగాణకు 10 ఏళ్లు పూర్తి అయింది. ఈ తరుణంలోనే కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దశాబ్ధి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగనున్నాయి.

It has been 10 years since Telangana was formed KCR’s sensational decision

జూన్ 1 :
గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.

జూన్ 2 :
దశాబ్ది ముగింపు వేడుకల సభ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది.

ఇదే రోజు హైదరాబాద్లో పలు దవాఖానాల్లో , అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జూన్ 3:
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ..తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు.. ఆయా జిల్లాల్లోని దవాఖానల్లో అనాథాశరణాలయాల్లో స్వీట్లు పండ్లు పంపిణీ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news