jagga reddy about sangareddy people: నన్ను ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదని సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి అనుచరుడి హత్య కేసుపై స్పందించారు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నన్ను, జీవన్ రెడ్డిని ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదన్నారు జగ్గారెడ్డి.

జీవన్‌రెడ్డి ఆవేదన చూసి బాధ కలిగింది.. జీవన్‌రెడ్డికి అండగా నేను ఉంటా అని తెలిపారు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ వాది, ఆయన జీవితమంతా కష్టాలే అని తెలిపారు. జీవన్ రెడ్డిని జగిత్యాల ప్రజలు, నన్ను సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదని వివరించారు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీని చాలా గొప్పదన్నారు.