అసదుద్దీన్ కు సవాల్ విసిరిన జగ్గారెడ్డి..దమ్ముంటే మెదక్ నుంచి పోటీ చేయాలంటూ..

రాహుల్ గాంధీపై అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్లుగా వార్ కు తెరలేచింది. వచ్చే ఎన్నికల్లో తాను హైదరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అని చెప్పిన జగ్గారెడ్డి ఇందుకోసం పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తానని కూడా చెప్పారు. హైదరాబాద్ కాకుండా కనీసం మెదక్ లో ఆయన పోటీ చేసే దమ్ముందా అని అసదుద్దీన్ ఓవైసీకి ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా మరే స్థానం నుంచి అయినా పోటీ చేసే దమ్ము ఉందా అంటూ జగ్గారెడ్డి సవాల్ చేశారు.

ఈమేరకు రాహుల్ గాంధీ కి దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని సవాల్ చేస్తూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ అరుగుల మీద కూర్చున్న చరిత్రను మరిచారా..? అంటూ అసద్ ను ప్రశ్నించిన జగ్గారెడ్డి.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ ఫ్యామిలీ కే సవాల్ విసురుతారా..? అని అసద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.