వెంకట్ ను బలి పశువు చేశారు.– జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

హుజూరాబాద్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడుతున్నాయి. నేతలు రెండు వర్గాల విడిపోయి విమర్శలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా జగ్గా రెడ్డి కూడా హుజూరాబాద్ ఎన్నికల్లో దారుణ పరాజయంపై స్పందించారు. ఆయన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ను బలి పశువు చేశారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. వెంకట్ అభ్యర్థిత్వంపై రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలే నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

కాగా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం నుంచి కొంతమంది నేతలు అసంత్రుప్తితో ఉన్నారు. అవి ఇప్పుడు బయటపడుతున్నాయి. జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేశారు. ’హుజూరాబాద్లో డిపాజిట్ వస్తే క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డిదే అని పలువురు అనేవారని, ఇప్పడు మేం ప్రచారంలో పాల్గొనపోకపోవడంతోనే డిపాజిట్ దక్కలేదని‘ రేవంత్ అభిమానులు ప్రచారం ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు రాష్ట్ర కాంగ్రెస్ తీరుపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version