Jammikunta: తహసీల్దార్ ఇంట్లో భారీగా బయటపడిన నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు

-

ఏసీబీ రైడ్స్‌లో జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంట్లో, ఆమె బంధువుల ఇళ్లల్లో 5 చోట్ల ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

Jammikunta Tehsildar Rajini was arrested by ACB officials Her illegal assets worth Rs.20 crores

ఈ సోదాల్లో 3 కోట్ల 20 లక్షల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. అంతే కాకుండా ఏడెకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వాటితో పాటు 1.4 కిలోల బంగారు ఆభరణాలతో పాటు లక్ష 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.. తహసీల్దార్ రజినికి కరీంనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version