అలోచించి, మంచి ఫ్యూచర్ కోసం మంచి పార్టీకి ఓటు వేయండి అని కోరారు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ. డబ్బంతా కేవలం తాత్కాలిక అవసరాలకే ఖర్చు పెట్టి రేపు ఏమీ లేకుండా చేసేవాళ్ళు ఖచ్చితంగా మన భవిష్యత్తుకి ప్రమాదం అవుతారని తాజాగా ఓ వీడియో ద్వారా చెప్పారు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ.
కేవలం తాత్కాలికంగా తాయిలాలు ఇచ్చేవారికి ఓటు వేయకండని స్పష్టం చేశారు. .ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగడానికి ఎవరు దోహదం చేస్తున్నారో వారికి ఓటు వేయండన్నారు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ.
కాగా, తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో 24 గంటల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ 24 గంటల వ్యవధి చాలా కీలకమైనది. ఈ సమయంలోనే డబ్బు కట్టలు విచ్చలవిడిగా పంపిణీ జరుగుతాయి. మద్యం ఏరులై పారుతుంది. అందుకే పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టారు. ఎన్నికల వేళ ప్రలోభాలపై ప్రత్యక దృష్టి సారించారు.