తెలంగాణ డీజీపీగా జితేందర్‌!

-

తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈరోజు ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా.. సీఎం మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్‌ కానున్నారు.

ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం డీజీపీగా రవిగుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌ను క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్‌ చేసిన తర్వాత రవిగుప్తాను ఎంపిక చేసింది. అప్పటినుంచి ఆయనే డీజీపీగా ఉన్నారు. తాజాగా జితేందర్‌ వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news