గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. 75 రోజులు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఔత్సాహికులు www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే ఉచిత శిక్షణ తీసుకోవాలని అనుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలని పేర్కొన్నారు.
ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెలకు రూ.5000 ఉపకార వేతనం అందజేస్తారని వెల్లడించారు. హైదరాబాద్ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ (రోడ్ నం: 8, లక్ష్మీనగర్), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇస్తారన్న శ్రీనివాస్ రెడ్డి.. మరింత సమాచారం కోసం 040-24071188 నంబరులో సంప్రదించాలని సూచించారు. మరోవైపు గ్రూప్-1 హాల్ టికెట్లు జులై 11వ తేదీ నుంచి అందుబాటులో ఉండనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.