తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీ

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకు మరో తీపి కబురు అందించింది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విద్య డైరెక్టరేట్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌, ఐఐపీఎం, ఆయుష్‌, ఔషధ నియంత్రణ మండలి, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, బయో మెడికల్‌, ఆడియో విజువల్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్‌లు సహా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ) పరిధిలో 3,235 పోస్టులను భర్తీ చేస్తారు. భర్తీ చేసే పోస్టుల్లో 1,988 మంది స్టాఫ్‌ నర్సులు, 1,014 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, 764 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 596 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తదితరాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news