నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్​ మెట్రోలో ఉద్యోగాలు

-

నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్​ మెట్రోలో ఉద్యోగాలకు ఎచ్​ఎమ్​ఆర్​ఎల్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఏఎమ్​ఎస్​ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. మరి ఈ ఉద్యోగాలు పొందాలంటే కావాల్సిన అర్హతలేంటో తెలుసుకుందామా..?

ఖాళీల వివరాలు..
మొత్తం ఖాళీలు-12
ఏఎమ్​ఎస్​ ఆఫీసర్​ – 1
సిగ్నలింగ్ టీమ్​ – 2
రోలింగ్​ స్టాక్ టీం లీడర్​ – 6
ట్రాక్స్ టీం లీడర్​ – 2
ఐటీ ఆఫీసర్​ – 1

కావాల్సిన అర్హతులు

1. AMS​ ఆఫీసర్​.. వ్యాపార విశ్లేషకుడిగా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌గా మంచి అనుభవం, IBM మ్యాక్సిమో సాఫ్ట్​వేర్​లో నైపుణ్యం ఉండాలి. అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ​

2. సిగ్నలింగ్ టీమ్​.. SIG/COM/AFC నిర్వహణలో డిప్లొమా ఇంజనీర్‌గా కనీసం 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కమ్యూనికేషన్​లో డిప్లొమా/ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అయిండాలి.

3. రోలింగ్​ స్టాక్ టీం లీడర్​.. ఇంజనీర్​- మెకానికల్​/​ ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రానిక్స్​లలో డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ , ఎలక్ట్రికల్​ లేదా మెకానికల్​ మెయింటనెన్స్​లో 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. అలాగే సాంకేతికత ఆధారిత రైలు/మెట్రో, పారిశ్రామిక వాతావరణంలో పని చేసే పరిజ్ఞానం ఉండాలి.

4. ట్రాక్స్ టీం లీడర్​.. బీఈ/బీటెక్​ పూర్తి చేసి నాలుగు సంవత్సరాల అనుభవం లేదా ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారికి ట్రాక్​ నిర్వహణలో.. 4 నుంచి 7 సంవత్సరాల అనుభవం, సివిల్​ లేదా మెకానికల్​లో డిప్లొమా/గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి.

5. ఐటీ ఆఫీసర్​.. బీటెక్​, ఐటీ/ఎమ్​సీఏ/ఐటీ/ ఎమ్​సీఏ-ఐటీ పూర్తి చేసి ఉండాలి. బహుళజాతి, సర్వీసెస్​ కన్సల్టింగ్ పరిశ్రమలలో 1-2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news