ఐఐటీ హైద‌రాబాద్ లో ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్‌!

హైద‌రాబాద్ ఉద్యోగాల‌కు నెల‌వు. ద‌క్ష‌ణ భార‌త‌దేశంలోనే ఐటీ రంగంలో మేటిగా పేరు తెచ్చ‌కున్న హైద‌రాబాద్‌లో గ‌త కొద్ది కాలంగా ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ నిలిచిపోయింద‌నే చెప్పాలి. కరోనా కార‌ణంగా ఉద్యోగాల నియ‌మ‌కాలు కాస్త వెన‌క‌బ‌డ్డాయి. అయితే ఇప్పుడు హైద‌రాబాద్‌లో ఐఐటీ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది.

సంగారెడ్డి స‌మీపంలో ఉన్న ఈ క్యాంప‌స్‌లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల చివ‌రి తేదీ రేప‌టితో (మే 31) ముగుస్తోంది. మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 3 ఖాళీల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు.

వీటి కోసం మెకానికల్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ప‌ట్టా ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 27–33 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. పూర్తి వివ‌రాల‌ను [email protected] మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు https://www.iith.ac.in వెబ్‌సైట్‌లో చూడాలి.