వెంట‌నే డ్యూటీలో చేరాలి : ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవ‌ల కొత్త జోన‌ల్ విధానంతో ద్వారా ప్ర‌భుత్వ ఉద్యోగులు బ‌దిలీ అయిన విష‌యం తెలిసిందే. అయితే బ‌దిలీ ప్ర‌క్రియా ముగిసినా.. కొంత మంది ఉద్యోగులు డ్యూటీల‌లో చేర‌లేదు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హించింది. కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ ప్ర‌కారం బదిలీ అయిన ఉద్యోగులు అంద‌రూ వెంట‌నే డ్యూటీల‌లో చేరాల‌ని ఆదేశాల‌ను జారీ చేసింది. ఉద్యోగులు డ్యూటీల‌లో చేర‌కుంటే.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.

telangana-logo

ఉద్యోగులు డ్యూటీల‌లో చేర‌డానికి 7 రోజుల స‌మ‌యం కేటాయించింది. ఈ 7 రోజుల‌లో డ్యూటీలో చేర‌కుంటే.. ఆయా స్థానాల‌ను ఖాళీ చూపి ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌డానికి ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తుంది. కాగ రాష్ట్రంలో ఇటీవ‌ల జీవో నెంబ‌ర్ 317 ప్ర‌కారం బ‌దిలీ ప్ర‌క్రియా సాగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది పైగా ఉద్యోగులు స్థానిక‌త‌ను కోల్పోవ‌డంతో పాటు మ‌రి కొన్ని కార‌ణాల వ‌ల్ల డ్యూటీలో చేర‌లేదు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. ఉద్యోగులు వెంట‌నే చేరాల‌న ఆదేశాల‌ను జారీ చేసింది.