రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటనలో కీలక విషయాలు వెల్లడువుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు మేజర్ అయిన సాదుద్దీన్ తో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విచారణలో మైనర్ నిందితులు సాదుద్దీనే మమ్మల్ని రెచ్చగొట్టారని ఆరోపిస్తుంటే.. సాదుద్దీన్ మైనర్లే ఈ ఘటనకు కారణం అంటూ కస్టడీలో చెబుతున్నారు. ఇప్పటికే నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించారు.
ఇదిలా ఉంటే కేసులో కీలకంగా బాధిత బాలిక మెడికల్ రిపోర్ట్ మారాయి. అత్యాచార సమయంలో బాలిక ప్రతిఘటిండచడంతో నిందితులు అమ్మాయిని తీవ్రంగా గాయపరిచారు. మొత్తం అమ్మాయి ఒంటిపై 12 వరకు గాయాలు ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. నిందితులు బాలిక మెడపై కొరుకుతూ..రక్కతూ దారుణంగా ప్రవర్తించారు. టాటూలా ఉండాలని మెడపై కొరికినట్లు నిందితులు వాగ్మూలం ఇచ్చారు. బాలిక ప్రతిఘటించడంతోనే గాయాలైనట్లు నిందితులు ఒప్పుకున్నారు. విచారణలో నిందితులు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.