రోజురోజుకు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతున్నట్లు కనపిస్తోంది. ఈ నేపథ్యం దక్షిణ మధ్య రైల్వే శని, ఆదివారాల్లో పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తూ వస్తోంది. అయితే తాజాగా మరోసారి.. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చింది. రాజధానిలో నేడు టెట్, ఆర్‌ఆర్బీ పరీక్షలు ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయడం గమనార్హం. సాంకేతిక కారణాల వల్ల 34 ఎంఎంటీఎస్ సర్వీసులను నిలిపివేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
ఇందులో లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసుల చొప్పున ఉండగా, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో ఒక్కో సర్వీసు చొప్పున రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు.