రామచంద్ర పెళ్లైకి జ్యుడీషియల్ రిమాండ్

-

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రామచంద్ర పిళ్ళై ఈడి విచారణ ముగిసింది. కస్టడీ సమయం ముగియడంతో రామచంద్రను రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. రామచంద్ర పెళ్లై నీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో అతడికి కోర్ట్ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయనకు ఏప్రిల్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

ఇక ఈ కేసులో ఉదయం నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇదే కేసులో జైల్లో ఉన్న అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ కోరుతూ ఈరోజు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం మద్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version