కేసీఆర్ పంపిన లేఖ పై పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. కెసిఆర్ పంపించిన లెటర్ కమిషన్ కి అందిందని తెలిపింది కమిషన్. మాజీ సీఎం కెసిఆర్ లెటర్ లో పలు అంశాలను ప్రస్తావించారన్న కమిషన్.. చత్తీస్గడ్ పవర్ పర్చేస్, భద్రాద్రి యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారని పేర్కొంది.
కెసిఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఎవరికైనా తమ అభిప్రాయాలను నిస్సందేహంగా చెప్పే స్వేచ్ఛ ఉంటుందని ఇప్పటికే తెలిపిన కమిషన్.. ఇటు కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందని వెల్లడించింది. వాస్తవాలపై BHEL ప్రతినిధులని కూడా వివరాలు అడుగ నున్న కమిషన్…ఇవాళ చర్చ అనంతరం దాని అనుగుణంగానే తదుపరి చర్యలు తీసుకోనుంది.