Security increased for Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. పవన్‌కు Y ప్లస్, ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈరోజు(మంగళవారం) సచివాలయానికి పవన్ కల్యాణ్ రానున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి వస్తున్నారు.
ఇక అటు ఉప ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగు పెట్టబోతున్నారు ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రాబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి రానున్నారు పవన్ కళ్యాణ్.
రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అమరావతికి వస్తున్న పవన్ కళ్యాణ్ కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం తెలుపనున్నారు అమరావతి రైతులు.