వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తా: కేఏ పాల్

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి షురూ అయింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలను పదును పెడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ ఇంకా కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవలే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఈ విషయంపై అక్టోబర్ 2న అధికారకంగా తన నిర్ణయం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కో-ఆర్డినేటర్ల సమావేశంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు.

అక్టోబర్ 2వ తేదీన జింఖానా మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఆ సభలోనే ప్రజాశాంతి పార్టీ ఎన్నికల భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశాన్ని ప్రధాని మోదీ మోసం చేస్తూ అప్పుల కుప్పగా మార్చారని కేఏ పాల్ ఫైర్ అయ్యారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే.. 6 నెలల్లో ప్రజలకు అభివృద్ది అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news