హామీల అమలును తప్పించుకోవాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తోంది : ఎమ్మెల్యే కడియం

-

కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో ప్రకటించిన ఆరు గ్యారంటీలను విస్మరిస్తోందని బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ పాల్గొన్న సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారు.

అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నిండు సభలో నిరుద్యోగ భృతి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదనీ మాట మార్చారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

“పంట రుణాలు తీసుకోని వాళ్లు బ్యాంకులకు వెళ్లి రెండు లక్షలు తీసుకొమ్మని రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి క్వింటాల్ కు మద్దతు ధరతో పాటు 5 వందలు బోనస్ ఇసామన్నారు. ఇచ్చిన హామీలను ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటుంది.” అని కడియం మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version