ఏకధాటి వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ

-

గత రెండ్రోజులుగా కురుస్తున్న ఏకధాటి వర్షాలకు రాష్ట్రమంతా జలమయమైపోయింది. ముఖ్యంగా పలు నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలోని కాళేశ్వరం, శ్రీరామ్ సాగర్, కడెం, స్వర్ణ జలాశయాలకు నీటి ప్రవాహం కొనసాగుతోంది.

ముఖ్యంగా మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి నుంచి వరద వచ్చే చేరడంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులోని లక్ష్మి బ్యారేజీకి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతోంది. ప్రాణహిత నుంచి 2లక్షల 58వేల 530 క్యూసెక్కుల మేర నీరు వస్తుంది. దాంతో బ్యారేజీలోని 85 గేట్లకు గాను 35 గేట్లు ఎత్తి 2 లక్షల 85 వేల 340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 9.8 టీఎంసీలు, అన్నారం బ్యారేజీలో 8 టీఎంసీల నీటి నిల్వ క్రమంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరగడంతో ప్రస్తుతం కాళేశ్వరంలో ప్రస్తుతం కాళేశ్వరంలో 8.250 మీటర్లు నీటి మట్టం నమోదైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news