ఎడిట్ నోట్: ఎన్డీయే x ఇండియా..లీడ్ ఎవరికంటే?

-

మొత్తానికి విపక్షాల కూటమికి ఒక పేరు పెట్టారు. దేశాన్ని రిప్రెజెంట్ చేసేలా ఇండియా అని పెట్టారు..ఐ‌ఎన్‌డి‌ఐ‌ఏ..అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్..అని విపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి లక్ష్యం ఒక్కటే కేంద్రంలో అధికారంలో బి‌జే‌పిని గద్దె దించడం..దీని కోసం కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రధాని పదవిని సైతం త్యాగం చేసింది. దీంతో కూటమి మరింత దూకుడుగా ముందుకెళ్లెలా ప్లాన్ చేశారు.

ఇక 11 మందితో కీలక కమిటీని నియమించారు. అందులో సభ్యుల పేర్లని తదుపరి సమావేశం జరగనున్న ముంబయిలో ప్రకటించనున్నారు. ఈ కూటమిలో కాంగ్రెస్, టి‌ఎం‌సి, ఎస్‌పి, డి‌ఎం‌కే, ఆప్, జే‌డి‌యూ, ఆర్‌జే‌డి, కమ్యూనిస్టులు సహ మొత్తం 26 పార్టీల వరకు పాల్గొన్నాయి. ఈ విపక్ష కూటమి సమావేశం బెంగళూరులో జరిగితే..దీనికి పోటీగా బి‌జే‌పి, దాని మిత్రపక్షాల ఎన్డీయే సమావేశం ఢిల్లీలో జరిగింది. రెండు ఒకే రోజు జరగడంతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ సమావేశ్మలో బి‌జే‌పితో సహ 38 పార్టీలు హాజరయ్యాయి. ఇక మళ్ళీ 50 శాతం ఓట్లతో తామే అధికారంలోకి వస్తామని మోదీ చెప్పుకొచ్చారు. విపక్ష కూటమి అంటే అవినీతి కూటమి అని విమర్శించారు.

అయితే ఎన్డీయే మీటింగ్‌లో 38 పార్టీలు పాల్గొంటే..అందులో 24 పార్టీలకు అసలు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేదు. పైగా రెండు పార్టీలకు కేవలం ఇద్దరు చొప్పున, 7 పార్టీలకు ఒకరు చొప్పున ఎంపీలు ఉన్నారని విపక్షాలు ఎద్దేవా చేశాయి. కానీ బి‌జే‌పినే మెయిన్ కాబట్టి..ఆ పార్టీకి పూర్తి బలం ఉంది.

వచ్చే ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. మొత్తం 543 పార్లమెంట్ సీట్లు ఉండగా…కేంద్రంలో అధికారంలోకి వచ్చే మ్యాజిక్ ఫిగర్ 272..గత రెండు ఎన్నికల్లో బి‌జే‌పి మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారం తెచ్చుకుంది. ఈ సారి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటుతామని బి‌జే‌పి ధీమాగా ఉంది. కానీ అది కష్టమే అని విపక్షాలు  అంటున్నాయి.

అందుకే బి‌జే‌పి..మిత్రపక్షాలని కలుపుకునే ప్రయత్నాలు చేస్తుందని, ఇటు తాము కూడా బలమైన విపక్షాలని కలుపుకుని బి‌జే‌పికి చెక్ పెట్టి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెబుతుంది. ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్తితుల్లో బి‌జే‌పికే ఆధిక్యం ఉంది…అంటే ఎన్డీయేకే లీడ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news