కానిస్టేబుల్ ను రేప్ చేసిన కాళేశ్వరం ఎస్సై అరెస్ట్

-

కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్ పై కేసు నమోదు అయింది. భవాని సేన్ గౌడ్ ను అరెస్ట్ చేసిన కాళేశ్వరం పోలీసులు.. జైలుకు తరలించారు. రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు రేప్ చేసాడు ఓ ఎస్సై. అందిన సమాచారం ప్రకారం… తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్నాడు కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్. భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి “ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని” ప్రాధేయపడ్డాడు.

The SS who raped the female constable twice

ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి రేప్ చేశాడు. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి రేప్ చేశాడట. తాను శ్రీధర్ బాబు మనిషిని అని తనని ఎవరూ ఏమీ చేయలేరని సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. చోటా మోటా నాయకులు ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే “బాబన్న (శ్రీధర్ బాబు) బావున్నాడా.. నాకు ఇంతకు ముందే ఫోన్ చేశాడు” అంటూ మాట్లాడేవాడు. ఈయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉండగా ప్రతిరోజూ ఒక చికెన్ సెంటర్ నుండి పావుకిలో చికెన్ పంపాలని హుకుం జారీ చేశాడు. ఆటో డ్రైవర్లు, చిల్లర వ్యాపారులను ఎవరినీ వదలకుండా రూ. 100 కూడా వదలకుండా వసూళ్లకు పాల్పడేవాడు.

Read more RELATED
Recommended to you

Latest news